సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వింతలేల సేసేవే
టైటిల్: వింతలేల సేసేవే
పల్లవి:
ప|| వింతలేల సేసేవే విభుడు నీకు నితడు | చెంత నీ మతి యాతని చిత్తముగాదా ||
చరణం:చ|| చిప్పిల మోవి ఇమ్మంటే సిగ్గువడనేటికే | చొప్పున నివి యాతని సొమ్ముగాదా |
కొప్పునీకు బెట్టేనంటే గొణగగ నేటికే | యెప్పుడూ నితని సేస కిరవుగాదా ||
చ|| చన్నులు చూపుమంటేను జంకించ నేటికే | పన్ని యీతనికి చేపట్లు గావా |
పన్నీట నోలార్చే నంటే పలు నవ్వులేటికే | అన్నిటా నీమెనితని కరుడు తీగెకాదా ||
చ|| మొలనూలు వెట్టరాగా మొక్కేవిదేటికే | పొలుపు శ్రీ వేంకటేశు పొలముగాదా |
అలరి నిన్నురమెక్కుమనగా గొంకనేటికే | నెలత నీవే యతని నిండు సొమ్ముగాదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం