సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వినుడిదె రఘుపతి
టైటిల్: వినుడిదె రఘుపతి
పల్లవి:
ప|| వినుడిదె రఘుపతి విజయములు | పనుపడి రాక్ష బాధలుడిగెను ||
చరణం:చ|| కులగిరులదరెను కుంభినివడకెను | ఇల రాముడు రథమెక్కినను |
కలగె వారిధులు కంపించె జగములు | బలు విలునమ్ములు పట్టినను ||
చ|| పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె | తొడిబడ బాణము దొడిగినను |
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు | యెడవక రావణునేసినను ||
చ|| చుక్కలు దుల్లెను స్రుక్కె భూతములు | తొక్కి యసురతల దుంచినను |
గక్కున శ్రీ వేంకటగిరి నిలువగ | అక్కజమగు శుభమందరి కొదవె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం