సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విరహ మొక్కందమాయ
టైటిల్: విరహ మొక్కందమాయ
పల్లవి:
విరహ మొక్కందమాయ విచ్చేయవయ్యా
నిరతి నాకెజూచి నీవంటా మొక్కితిమి ||
చెక్కిటిచెయ్యే చెలికి శేశపరియంకమాయ
జక్కవ చన్నులు శంఖ్హచక్రములాయ
వుక్క చెమటే జలధివునికి సేసుక నిన్ను
జక్కని సతి దలచి సారూప్యమందె ||
చలువ కస్తూరి పూత సరినీలవర్ణమాయ
మెలుత నివ్వెర గనిమిశద్రిశ్టాయ
తొలుత చిగురు పాన్పు తులసి పూజాయ నిన్ను
జలజాఖ్శి తలపోసి సారూపుఅమందె ||
సిరులగట్టిన తాళి శ్రీధరభావమాయ
వరుస వలపు భక్తవత్సలమాయ
యిరవై శ్రీవేంకటేశ యింతలో నీవుగూడగా
సరుసనిన్నంటి వాకె సారూప్యమందె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం