సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విరహాన బడలెను
టైటిల్: విరహాన బడలెను
పల్లవి:
ప|| విరహాన బడలెను విభుడు యిందాకాను | పురుషార్థమిందు వంక బొందేదేమే ||
చరణం:చ|| కంతునిదీపమవై ఘమ్మని భ్రమయించేవు | పొంత నిండు వంక నేమిపుణ్యమే నీకు |
పంతమున వలపించి పలుమారు నలిగేవు | యెంత లాభము గలిగె నిందు వంక నీకు ||
చ|| చెరకు సింగణివై చెలువుని నేచేవు | గురిగా నెంత ధనము గూడెనే నీకు |
వెరగువడుచు నీవు వెంటవెంట దిప్పేవు | నెర దొరతనమెంత నేర్చితివె నీవు ||
చ|| పూవుల గాలమవై పురుషుని దగిలేవు | వేవే యెంత రాజ్యమేలితిదె నీవు |
యీవల శ్రీ వేంకటేశుడితడిట్టె నిన్నుగూడె | కైవశమై యెంత కొడిగట్టితివె నీవు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం