సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విఱిగిరి దానవవీరు
పల్లవి:

ప|| విఱిగిరి దానవవీరు లదె | అఱిముఱి దేవత లాడే రదె ||

చరణం:

చ|| సరగునకంభ మదె పగిలె నదె | హరినరసింహంబాయ నదె |
గరుడధ్వజ మదె ఘనచక్రం బదె | మొరసేటిశంకపుమ్రోత లవె ||

చరణం:

చ|| వెడలె వెడలె నదె పెనుకొని హిరణ్యు | దొడికిపట్టె నదె తొడమీద |
విడువక చించిన వేయిచేతులవె | కడపమీదనే కదల డదె ||

చరణం:

చ|| అదె వామాంకంబందు లక్ష్మియదె | కదిసి శాంతమదే కరుణ యదె |
వుదుటున ప్రహ్లాదు నూరడించె నదె | యిదె శ్రీవేంకట మెక్కె నదె ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం