సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విష్ణుడే ఇంతానని
పల్లవి:

విష్ణుడే ఇంతానని భావించుటే బుద్ది
వైష్ణవుడై ఆచార్య సేవ చేయుటే బుద్ది

చరణం:

కొండ వంటి తనలోని కోపము రేగ వచ్చితే
దండనే ఎచ్చరి ఊరకుండుటే బుద్ది
మెండుగా పరకాంతల మీద తమి పుట్టితేను
అండ కాచి అందుకు భ్రమయకుండుటే బుద్ది

చరణం:

చరణం:

అట్టె ఎవ్వరైనా గృహారామాదులపై ఆశ
పుట్టించితే వాని వెంట పోనిదే బుద్ది
చుట్టపు సంబంధాన సోకితే పరబాధలు
చుట్టుకోక లోను కాక జునుగుటే బుద్ది

చరణం:

చరణం:

తప్పదింతా దైవికమే తన వద్దనున్నవారి
తప్పులు పట్టనిదే తగని బుద్ది
ఎప్పుడు శ్రీ వేంకటేశుడెదలోన నున్నవాడు
చొప్పెట్టి ఆతని మూర్తి చూచుటే బుద్ద

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం