సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
పల్లవి:

వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
భవసంపదలపెద్దపౌజు చూచీ జీవుడు

చరణం:

చిత్తమనియెడిమహాసింహాసనం బెక్కి
హత్తిబహుపరాకాయ నదె జీవుడు
గుత్తపుదేహమనేటికొలువుకూటములోన
జొత్తు బ్రకృతినాట్యము చూచీవి జీవుడు

చరణం:

పంచేంద్రియములనేబలుతేజీలపై నెక్కి
అంచల వయ్యాళిదోలీ నదె జీవుడు
ముంచినకర్మములనేముద్రలపెట్టెలు దెచ్చి
సంచముగా లెక్కవెట్టి సరి దాచీ జీవుడు

చరణం:

యిచ్చ గామక్రోధాలనే హితమంత్రులును దారు
తచ్చి తలపోసుకొనీ దగ జీవుడు
అచ్చపుశ్రీవేంకటేశు డంతరాత్మయై యుండగా
పచ్చిగా నాతని జూచి భ్రసీని జీవుడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం