సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వివేకమెఱుగనివెఱ్ఱులముగాక
టైటిల్: వివేకమెఱుగనివెఱ్ఱులముగాక
పల్లవి:
ప|| వివేకమెఱుగనివెఱ్ఱులముగాక నేము | దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా ||
చరణం:చ|| మానివోడ నమ్మి వొక్కమనుజుడు వార్ధి దాటి | నానార్థములు గూర్చి నటించగాను |
దానవారికృప నమ్మి తగినసంసారవార్ధి- | లోను చొచ్చి దాటి గెల్వ లోకులకు జెల్లదా ||
చ|| జుట్టెడుయినుము నమ్మి సొరిది నొక్కడు భూమి | గట్టడిభయములెల్ల గడవగాను |
నెట్టన జక్రాయుధుని నిజనామ మిటు నమ్మి | తట్టి భవభయములు తరి దాటజెల్లదా ||
చ|| వేలెడుదీపము నమ్మి వెడగుజీకటి బాసి | పోలిమి నొక్కనరుడు పొదలగాను |
ఆలించి శ్రీవేంకటేశు డాత్మలో వెలుగగాను | మేలి మాతని గొలిచి మెరయంగవలదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం