సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వివరముమాలినట్టివెర్రిదేహి తొల్లి
పల్లవి:

వివరముమాలినట్టివెర్రిదేహి తొల్లి
జవకట్టినంతే కాక చండిపోరనేటికే

చరణం:

మనసంతే మంగళము మరి యెంత పొరలినా
తనువుకొలదియే సత్వములెల్లాను
తనకలి మెంచుకోక తగనిమురిపెముల
పెనగబోతే తీపు పిప్పిలోన గలదా

చరణం:

చెంది విత్తినకొలదే చేరి మొలచేటిపైరు
అంది ఆకటికొలదే ఆహారమెల్ల
ముందువెనక చూడక మొక్కలపుపరువేల
అందనిమానిపంటికి నాసపడవచ్చునా

చరణం:

శ్రీవేంకటేశ్వరు గొలిచిన కొలదియే మేలు
భావించ నాతడిచ్చేది భాగ్యమెల్లాను
వేవేలు మొక్కులేల వెస నానాటికి నెల్ల
తోవగానితోవ బోతే తుదకెక్కగలదా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం