సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలచి పైకొనగరాదు
టైటిల్: వలచి పైకొనగరాదు
పల్లవి:
వలచి పైకొనగరాదు వలదని తొలగ రాదు
కలికిమరుడు సేసినాజ్ఞ కడవగరాదురా
ఆంగడికెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
ముంగిటిపసిడి కుంభములును ముద్దుల కుచయగంబులు
ఎంగిలిసేసినట్టి తేనె లితవులైనమెరుగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు
కంచములోని వేడి కూరలు గరవంబులు బొలయలుకలు
ఎంచగ నెండలో నీడలు యెడనెడకూటములు
తెంచగరాని వలెతాళ్ళు తెలివి పడని లేతనవ్వులు
మంచితనములొని నొప్పులు మాటలలొని మాటలు
నిప్పులమీద జల్లిన నూనెల నిగిడి తనివిలేని యాసలు
దప్పికి నెయిదాగినట్లు తమకములోని తాలిమి
చెప్పగరాని మేలు గనుట శ్రీవేంకటపతి గనుటులు
అప్పనికరుణగలిగి మనుట అబ్బురమైన సుఖములు
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం