సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలచిన పతివాడే
టైటిల్: వలచిన పతివాడే
పల్లవి:
ప|| వలచిన పతివాడే వచ్చినదాన నేనిదె | తలపులు దలపులు తారుకాణలెన్నడే ||
చరణం:చ|| పుచ్చబుచ్చ పున్నములు పొలతి నీ నవ్వులు | యిచ్చట నీపతి జూచేదిక నెన్నడే |
నిచ్చనిచ్చ గొత్తలాయ నెలత నీ జవ్వనము | మెచ్చిమెచ్చి ఆతనితో మేలమాడుటెన్నడే ||
చ|| వండవండ నట్లాయ వాడిక నీవలపు- | నిండినపతి కౌగిట నించుటెన్నడే |
వుండనుండ నొగరాయపువిద నీ జంకెనలు | అండ నాతనికి వినయాలు సేయుటెన్నడే ||
చ|| తినదిన దీపులాయ తెరవ నీమోవి జున్ను | పొనిగి శ్రీ వేంకటేశు పొందులెన్నడే |
ననిచియీతడే నేడు నయముల నిన్నుగూడె | మనికి మీ లోలోన మందలించుటెన్నడే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం