సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలచుటే దోసమా
టైటిల్: వలచుటే దోసమా
పల్లవి:
ప|| వలచుటే దోసమా వనిత నీకాతడు | నలువంక మరియేటి నవ్వులు నవ్వవే ||
చరణం:చ|| పంతమెల్ల నీమాటపట్టు లోననే వున్నది | చింతలెల్ల నీచెక్కు చేతనున్నవి |
వింతలన్నియును నీ నివ్వెరుగులతో నున్నవి | యెంతకెంత పతినింకా యేటికి దూరేవే ||
చ|| బిగువెల్ల నిపుడు నీపెదవులపై నున్నది | తెగువలు నీకన్నుల తేటనున్నవి |
ఆగడింతా నీ పొలయలుకలలో నున్నది | యెగసక్కేలాతని నేటికి నాడేవే ||
చ|| గబ్బితనమెల్లాను నీ కౌగిటిలోనే వున్నది | నిబ్బరము నీవుండేటి నీటులో నున్నది |
అబ్బరమై శ్రీ వేంకటాధీశుడు నిన్నుగూడె | వుబ్బున నీతనికెంత వొరటలు చూపవే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం