సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలదన నొరులకు
టైటిల్: వలదన నొరులకు
పల్లవి:
ప|| వలదన నొరులకు వశమటనే | తలచినట్లనిది దైవమెచేసె ||
చరణం:చ|| తరుణికుచములను తామరమొగుడలు | విరిసెనోయని వెరపునను |
సరగున పతిసఖ చంద్రశకలములు | దరులుగలుగనిది దైవమెచేసె ||
చ|| పొలతివదనమను పున్నమచంద్రుడు | బలిమినెగయునని భయమునను |
మెలుతచికురధ మ్మిల్లపురాహువు | తలచెదరగనిది దైవమెచేసె ||
చ|| వనితకువాడునొ వలపుతాపమున | తనులతికయనుచు తమకమున |
ఘనవేంకటపతి కౌగిటచమటల | తనివి దీర్చనిది దైవమెచేసె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం