సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలెననువారిదె
పల్లవి:

ప|| వలెననువారిదె వైష్ణవము యిది | వలపుదేనెవో వైష్ణవము ||

చరణం:

చ|| కోరికలుడుగుచు గురి నిన్నిటిపై | వైరాగ్యమెపో వైష్ణవము |
సారెకు గోపము జలమును దనలో | వారించుటవో వైష్ణవము ||

చరణం:

చ|| సుడిగొను దేహపు సుఖదుఃఖములో | వడి జొరవిదెపో వైష్ణవము |
ముడివడి యింద్రియములకింకరుడై | వడబడనిదెపో వైష్ణవము ||

చరణం:

చ|| వుదుటున దనసకలోపాయంబులు | వదలుటపో వైష్ణవము |
యెదుటను శ్రీవేంకటేశ్వరునామము | వదనము చేర్చుట వైష్ణవము ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం