సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలపేడ గలిగెనె
పల్లవి:

వలపేడ గలిగెనె వామలోచనకు దీని
వలపించినటువంటి వాడింకనెవ్వదో ||

చరణం:

సిరులు గల మోమెల్ల చిరునవ్వుగనుదోయి
విరిపైన వురమెల్ల వేకమైన గుబ్బలు
తరుణికి వెనకెల్ల దురుము పిఋదులను మంచి
నిరతంబునడవెల్ల నిండుమురిపెములు ||

చరణం:

జలజాక్శి నిలువెల్ల చక్కదనముల పోగు
కలికి తనమెల్ల గన్నులపండువు
కకంటి వయసెల్ల గడుగోములము దీని
పలుకుదేనియలెల్ల పంచదార కుప్పలు ||

చరణం:

చెలుపైన మోమెల్ల చిలుక వోట్లు దీని
కలదేహ మింతయును గస్తూరి వాసనలు
అలరించె దిరువేంకటాధీశ్వరుడు దీని
తలపెల్ల విభునిలో దాగున్న కరువు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం