సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలపు లధికము
టైటిల్: వలపు లధికము
పల్లవి:
ప|| వలపు లధికము సేయు వైభవములు | తలపు లధికము సేయు దలపోతలు ||
చరణం:చ|| కోప మధికముసేయు గోరికలు | తాప మధికముసేయు దమకంబులు |
కోపంబు దాపంబు గూడ నధికముసేయు | యేపయినమోహముల నేమందమే ||
చ|| మచ్చి కధికముసేయు మన్ననలు | యిచ్చ లధికముసేయు నీరసములు |
మచ్చికలు నిచ్చలును మగుడ నధికముసేయు- | నెచ్చరికకూటముల నేమందమే ||
చ|| అందమధికముసేయు నైక్యములు | పొందు లధికముసేయు బొలయలుకలు |
అందములు బొందులును నలర నధికము సేయు- | నెందు నరుదగువేంకటేశుకృపలు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం