సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వనిత భాగ్యంబు
టైటిల్: వనిత భాగ్యంబు
పల్లవి:
ప|| వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకుం- | బనిగాదు యింక నీ పాదంబులాన ||
చరణం:చ|| అడబాల సతి బోనమారగించు మటంచు | బడి బడి నీ కడు విన్నపము సేయంగ |
వుడుగని పరాకున వుండి నెచ్చెలి మీద | బడలి వొరగినది నీ పాదంబులాన ||
చ|| అడపంబు సతి వీడె మవధరింపు మటంచు | అడరి కప్పురపుం బలుకందియ్యగా |
కడు కంటం జూడదిదే కాంతాళమో మరపో | పడతి యిప్పుడు నీ పాదంబులాన ||
చ|| ఆలవట్టము విసరు అతివలను వలదనదు | పాలిండ్లపై కొంగు సవరించదు |
యేలాగౌనో వేంకటేశ నీవిపుడిట్టె | పాలించకున్న నీ పాదంబులాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం