సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వనిత పాలికిని
టైటిల్: వనిత పాలికిని
పల్లవి:
ప|| వనిత పాలికిని దేవరవు నీవు | వనమె జవ్వనమిందె వరమియ్యవలెను ||
చరణం:చ|| ముదితకు నీతోపాటు మోహన మంత్రము | చదరపు నీపురము జపశాల |
మదిలోన నీరూపు మరవని ధ్యానము | వదల రా దిక నీవు వరమియ్యవలెను ||
చ|| పడతికి నీశయ్య బలు పుణ్యక్షేత్రము | వడలి చెమట నీపై హోమకృత్యము |
అడరు మోవితేనలు ఆరగింపు నైవేద్యాలు | వడి జేకొనిక నీవు వరమియ్యవలెను ||
చ|| కామినికి నీకూటమి ఘన దివ్యయోగము | నేమపు బరవశము నిజానందము |
ఆముక శ్రీవేంకటేశ ఆపె నీవు గూడితిరి | వాములుగా నిట్టె వరమియ్యవలెను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం