సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వనితలకు బతికి
టైటిల్: వనితలకు బతికి
పల్లవి:
ప|| వనితలకు బతికి వలపే కీలు | ననువు గలిగితేను నాను బ్రియములా ||
చరణం:చ|| చిత్తమువచ్చినచోట సెవలెల్లా నీడేరు | అత్తుగ డయితే మాట లనువు లౌను |
పొత్తులు గలిగితేను భోజనాలు రుచులౌను | బత్తి గలిగితేను యేపనులైనానౌను ||
చ|| చెలిమి సేసినచోట చెలగు మంచితనాలు | తలపు గలిగితేను తమిరేగును |
బలిమి బొగడితేను భావములు గరగును | నెలవై పాయకుండితే నిలుచు మచ్చికలూ ||
ప|| కందువ గలుగుచోట కాపురాలు వేడుకలౌ | చందముగా బెనగితే సరసమౌను |
యిందునే శ్రీ వేంకటేశయే నలమేలుమంగను | పొందితివి నిట్టే పొసగుమన్ననలూ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం