సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వననిధి గురిసినవాన
టైటిల్: వననిధి గురిసినవాన
పల్లవి:
ప|| వననిధి గురిసినవాన లివి మతి- | పనిలేని పనులభారములు ||
చరణం:చ|| అడవులవెన్నెల లారిడిబదుకులు | తడతాకులపరితాపములు |
వొడలొసగినహరి నొల్లక యితరుల | బడిబడి దిరిగిన బంధములు ||
చ|| కొండలనునుపులు కొనకొనమమతులు | అండలకేగిన నదవదలు |
పండినపంటలు పరమాత్ము విడిచి | బండయితిరిగిన బడలికలు ||
చ|| బచ్చనరూపులు పచ్చలకొలపులు | నిచ్చలనిచ్చల నెయ్యములు |
రచ్చల వేంకటరమణుని గొలువక | చచ్చియు జావని జన్మములు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం