సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల
టైటిల్: వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల
పల్లవి:
వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల
చరణం:వట్టిన నేమముతోడ బ్రదుక గవలదా.
చరణం: చరణం: చరణం:తల్లిదండ్రిగలవారు తమలేము లెఱగక
చరణం:చెల్లపిళ్లలై యాటల జెందినయట్టు
చరణం:వుల్లములో హరినమ్మివుండినప్రపన్నులెల్ల
చరణం:పల్లదాన నిర్భరులై బ్రతుకగవలదా.
చరణం: చరణం: చరణం:మగడుగలసతులు మంచి ముత్తైదువలై
చరణం:యెగువ నితరమార్గా లెరగనట్టు
చరణం:నగుతా లక్ష్మీపతి నమ్మినప్రపన్నులెల్ల
చరణం:పగటు గర్మము మాని బ్రదుకగవలదా.
చరణం:యేలికె నమ్మినబంటేరికి బ్రియము చెప్ప
చరణం:కోలి బతివాకిలి గాచుండినయట్టు
చరణం:తాలిమి శ్రీవేంకటేశుదాసులైనప్రపన్నులు
చరణం:పాలించినాతని నమ్మి బ్రతుకగవలదా.
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం