సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వట్టియాసలకు లోనై
టైటిల్: వట్టియాసలకు లోనై
పల్లవి:
ప|| వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు | బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ ||
చరణం:చ|| చాలనమ్మి యీసంసారమునకు సోలిసోలి తిరిగేవు | బాలయవ్వన ప్రౌఢలభ్రమ బడి లోలుడవై తిరిగేవు |
మేలుదెలియ కతికాముకుండవై మీదెరుగక తిరిగేవు | మాలెమీద పరువెందాకా నీమచ్చిక విడువగలేవు ||
చ|| మానితముగ దురన్నపానముల మత్తుడవై వుండేవు | నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు |
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు | ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియగలేవు ||
చ|| పామరివై దుర్వ్యాపారమునకు పలుమారును బొయ్యేవు | వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు |
ప్రేమతో హరిదాసులపై సంప్రీతి నిలుపగాలేవు | తామసమతివయి వేంకటనాథునితత్త్వ మెరుగగాలేవు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం