ఇందరివలె జూడకు యింకా నన్ను మందలించి యెటువలె మన్నించినా మంచిదే
ఇందాకా నెఱగనైతి నిక గపటములేల చెంది యిట్టె నాతోడ జెప్పవయ్య మాటలు
ఇందిర వడ్డించ నింపుగను చిందక యిట్లే భుజించవో స్వామి
ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె పొంది యీతని పూజింప పొద్దాయనిపుడు !!
ఇందిరాధిపునిసేవ యేమరకుండుటగాక బొందితోడిజీవులకు బుద్ధు లేటిబుద్ధులు
ఇందిరానాథు డిన్నిటి కీత డింతే బందెలకర్మములాల పట్టకురో మమ్మును ||
ఇందిరానామ మిందరికి కుందనపుముద్ద వోగోవింద ||
ఇందిరానాయక యిదివో మాపాటు చెంది నీవే గతి చేకొనవయ్యా ||
ఇందిరాపతిమాయలు యింతులు సుండీ మందలించి హరి గొల్చి మనుదురుగాని ||
ఇందు నుండి మీకెడలేదు సందడి సేయక చనరో మీరు ||
ఇందుకంటే మరి యికలేదు హితోపదేశము వోమనసా అంది సర్వసంపన్నుడు దేవుడు అతనికంటే నేరుతుమా
ఇందుకుగా నాయెరగమి నేమని దూరుదును అందియు నినునే దెలియక అయ్యోనేనిపుడు ||
ఇందుకేకాబోలు నీవు యిట్టే యవధరించేవు కందువ లన్నియు నీమై గనియైనట్లుండె ||
ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు కందువెఱుగుదువు యీకత నీవే నేర్తువే ||
ఇందుకేపో వెరగయ్యీ నేమందును కందులేనినీమహిమ కొనియాడగలనా