ఇదివో సుద్దులు యీరేపల్లెను కదిసి యిందరివీ( గైకొనవయ్యా
ఇదె నీ కన్నుల యెదిటికివచ్చితి కదియుచు నెట్లైన గావక పోదు ||
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా
ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు దగు గద్దరికన్నుల జూడ గలిగెగా మనకు ||
ఇద్దరి గూరిచితిమి యేము చెలికత్తెలము పొద్దు కొకకొత్తలుగా భోగించరయ్యా
ఇద్దరి తమకము నిటువలెనె పొద్దున నేమని బొంకుదమయ్యా
ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె అడ్డుకొని తులదూగినట్టి చందమాయెను ||
ఇద్దరు జాణలేమీరు యెంచి చూచితే పొద్దులు గడుపుదురా పొరుగునను ||
ఇద్దరు నొకటే యెప్పుడును బుద్ధులు చెప్పరే పొలతుకలూ ||
ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని
ఇన్ని చేతలును దేవుడిచ్చినవే ఉన్నవారి యీపులెల్ల నొద్దికయ్యీనా ||
ఇన్ని దేహముల బుట్టి యేమిగంటిమి పున్నతపుహరిదాస్యమొక్కటేకాక
ఇన్నిచదువనేల ఇంత వెదకనేల కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
ఇన్నిట నింతట ఇరవొకటే వెన్నుని నామమే వేదంబాయె ||
ఇన్నిటా ఘనుడు దాను యేమి చెప్పేరే యెన్నుకోనీ నా గుణము లేమి చెప్పేరే ||