ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము
ఆతడే సకలవ్యాపకు డతడే యాతురబంధువు డతడు దలపులముంగిట నబ్బుట యెన్నడొకో
ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము // పల్లవి //
ఆతనిమూలమే జగమంతా నిది ఆతుమలో హరి కీలుఅయివుండుఁగాని // పల్లవి //
ఆతుమ సంతసపెట్టుటది యెఱుక తా నేతెరువు నొల్లకుండు టదియే యెఱుక
ఆది మునుల సిద్ధాంజనము యేదెస చూచిన నిదివో వీడే
ఆది దేవా పరమాత్మా వేద వేదాంతవేద్య నమో నమో !!
ఆదిదేవుం డనంగ మొదల నవతరించి జలధి సొచ్చి వేదములును శాస్త్రములను వెదకి తెచ్చె నితండు
ఆదిదైవుడై అందరిపాలిటి కీ దేవుడై వచ్చె నితడు
ఆదిపురుషా అఖిలాంతరంగా భూదేవతా రమణ భోగీంద్ర శయనా
ఆదిమ పురుషుడు అహోబలమను వేదాద్రి గుహలో వెలసీవాడే
ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు ఆదిదేవు డీతడేపో హరి శ్రీ వేంకటవిభుడు
ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు ఏదెస జూచినా తానె ఈతడిదె దేవుడు
ఆదిమూలమే మాకు నంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష