అహోబలేశ్వరుడు అరికులదమనుడు మహా మహిమలకు మలసీవాడె // పల్లవి //
ఆ రూపమునకే హరి నేను మొక్కెదను చేరి బిభీషణుని శరణాగతుడని చేకొని సరిగాచితివి
ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు
ఆకెవో నాప్రాణ మోహనపు రాణి దాకొని వేవేలు కాంతలలోన నున్నది
ఆచారవిచారా లవియు నే నెరఁగ వాచామగోచరపువరదుఁడ నీవు // పల్లవి //
ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ వేడుక పరషులెల్ల వీధి చూడరమ్మ
ఆడరమ్మా పాడారమ్మా అందరు మీరు వేడుక సంతసంబులు వెల్లివిరియాయను
ఆడరానిమా టది గుఱుతు వేడుకతోనే విచ్చేయుమనవే // పల్లవి //
ఆడరో పాడరో అప్సరోగణము వీడెము లిందరో విభవము నేడు
ఆడరో పాడరో ఆనందించరో వేడుక మొక్కరో విఙ్ఞానులు // పల్లవి //
ఆడుతా పాడుతా అట్టె ముద్దుగునుసుతా వోడక నీదండ చేరి వున్నారమయ్యా
ఆడువారు కడుగోపులవుట నీ వెరగవా నేడు గొత్తలుగా భూమి నేర్పుక వచ్చేరా
ఆణికాడవట యంతటికి జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు // పల్లవి //
ఆతడదె మీరదె అప్పగించితిమి మేము మీతల పుదాన నేను మీకేలే చింత ||