ఇందుకేపోవెరగయ్యీ నేమందును కందులేని నీమహిమ కొనియాడగలనా ||
ఇందుకొరకె యిందరును నిట్లయిరి కిందుపడి మరికాని గెలుపెరగరాదు ||
ఇందునందు దిరుగుచు నెవ్వరివాడవుగాక బందెపసరమువైతి బాపు జీవుడా ||
ఇందునుండ మీకెడ లేదు సందడిసేయక చనరో మీరు ||
ఇందుమీద సతిభావ మెట్లౌనో యేమౌనో విందుగా జెలువునికి విన్నవించరే ||
ఇందులో మొదలికర్త యెవ్వడు లేడుగాబొలు ముందు కరివరదుడే ముఖ్యుడుగాబోలు
ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||
ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము అచ్చుతనామమెపో అధికపుధనము
ఇట మీద కడమెల్లా నిక నీవు దీర్చవయ్యా పటుకున జెలి నీకు బాలుపెట్టీ నిదిగో ||
ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె ||
ప|| ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుడే రక్షకుడు | తటుకున స్వతంత్రముడిగినయాత్మకు తగునిశ్చింతయే పరమసుఖము ||
ఇటువంటి దాన నాకేటి యలుకే గట కట తేరాగా గాదనేనా నేను ||
ఇటువంటివాడు తాను యెదురాడేనా నేను చిటుకన జెప్పినట్టు సేసేనే తనకు ||
ఇటువలెపో సకలము యించుకగన భావించిన అటమటములసంతోషము ఆసలుసేయుటలు ||
ఇట్టి జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే పుట్టుగులు మరిలేవు పొందుదురు మొక్షము