ఇతరచింత లేక యేమిటికి అతడే గతియై అరసేటివాడు ||
ఇతరదేవతల కిది గలదా ప్రతి వేరీ నీప్రభావమునకు
ఇతరములిన్నియు నేమిటికి మతిచంచలమే మానుటపరము
ఇతరమెరుగ గతి ఇదియే శరణ్యము సతత పూర్ణునికి శరణ్యము ||
ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు పతులకు సతులకు భావజుడే సాక్షి ||
ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటూ కొత్తసేతలెల్ల దొరకొంటిగా నీవు ||
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి యిదిగాక వైభవం బిక నొకటి కలదా
ఇదిగో మా యజ్ఞాన మెప్పుడును సహజమే కదిసి నీవే కరుణించవయ్యా ||
ఇదియె నాకు మతము ఇదివ్రతము వుదుటుల కర్మము వొల్లనింకను ||
ఇదియే మర్మము హరి యిందుగాని లోనుగాడు పదపడి జీవులాల బదుకరో ||
ఇదియే రమయోగ మిద్దరికి విభుడా అదన ననిచన ద్రిస్శ్తాంత మాయనిపుడు ||
ఇదియే వేదాంత మిందుకంటె లేదు ఇదియే శ్రీవేంకటేశుని మతము ||
ఇదియే సాధన మిహపరములకును పదిలము మాపాలి పరమపు నామము ||
ఇదియే సులభము ఇందరికి కదియగ వశమా కరుణనె గాక
ఇదివొ సంసార మెంతసుఖమోకని తుదలేనిదుఃఖమను తొడవు గడియించె ||