ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక పట్టి సములమంటానే భక్తుల దూషింతురు
ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల కట్టునా కర్మములెల్ల గాలి బోబుగాక
ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే
ఇట్టి విందు గంటివా నీవెక్కదైనా అట్టె ఆకెపొత్తున నీవారగించవయ్యా ||
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే ||
ఇతడుచేసినసేత లెన్నిలేవిలమీద యితడు జగదేకగర్వితుడౌనో కాడో ||
ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ||
ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||
ఇతనికంటె ఘనులిక లేరు యిరర దేవతల యిందరిలోన॥
ఇతనికంటే ఘనులు ఇకలేరు ఇతరదేవతల ఇందరిలోన ||
ఇతనికంటే నుపాయ మిక లేదు మతిలోననున్న వాడు మర్మ మిదే సుండీ.
ఇతర చింత లిక నేమిటికి అతడే గతియై అరసేటివాడు
ఇతర దేవతల కిదిగలదా ప్రతివేరి నీ ప్రభావమునకు ||
ఇతర ధర్మము లందు నిందు గలదా మతి దలప పరము నీమతముననే కలిగె ||