ఇన్నిటి మూలంబీశ్వరుడాతని మన్నన కొలదినె మలయుట గాక
ఇన్నిటికి బ్రేరకుడు యీశ్వరుడింతే పన్ని యీతని దెలిసి బ్రదుకుటే జ్ఞానము ||
ఇన్నిటికి మూలము యీతనిరూపు యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె ||
ఇన్నినేతలకు నిది యొకటే కన్నా మన సిది కానదుగాని||
ఇన్నియు గలుగుటేజన్మమున నైన జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు ||
ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే పన్ని పరుల చెప్పగ చోటేది ||
ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||
ఇన్నిలాగులచేత లివియపో కడు నెన్నికకెక్కిన చేతులివియపో ||
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి
ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||
ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి ||
ఇరవగువారికి యిహపర మిదియే హరిసేవే సర్వాత్ములకు ||
ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు ||
ఇలయును నభమును నేకరూపమై జలజల గోళ్ళు జళిపించితివి ||
ఇలువేల్పితడే ఇందరికిని మరి పలువేల్పులతో పనియికనేలా