ప|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను | వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక ||
ఇసుక పాతర యిందుకేది కడగురుతు రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||
ఇహపరములకును ఏలికవు బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
ఇహము బరము జిక్కె నీతనివంక అహిశయనునిదాసులంతవారు వేరీ
ఇహమును బరమును యిందే వున్నవి వహికెక్క దెలియువారలు లేరు ||
ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు సహజమై హరియే శరణము నాకు ||
ఇహమేకాని యిక బరమేకాని బహుళమై హరి నీపైభక్తే చాలు ||
ఈ జీవునకు నేది గడపల తనకు నేజాతియును లేక యిట్లున్నవాడు ||
ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది॥
ఈ మాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను నేమమెంత నేమెంత నీకరుణ యెంత.
ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిది పావనులహ్రుదయమున బ్రభవించుగానిని ||
ఈకెకు నీకు దగు నీడు జోడులు వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||
ఈడ నుండె నిందాకా నింటిముంగిట ఆడ నెందు బోడుగద అప్పుడే యీకృష్ణుడు
ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా ||
ఈడేర వలచితే యే పని సేయగ రాదు యేడనైన యెగ్గు సిగ్గులెంచేరా భూమిని