ఎట్టున్నదో నీమనసు యేమి సేతురా యెట్టనెదుట బాయలే నేమి సేతురా ||
ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన గుడుసువడె జదువు, మెరుగులవారె జలము ||
ఎత్తరే ఆరతులీపై కింతులాల హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||
ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు మదిదెలియమమ్మ ఏమరులోగాని ||
ఎదుటినిధానమ వెటుజూచిన నీ వదె వేంకటగిరియనంతుడా ||
ఎదురు గుదురుగాను మేల నవ్వీనే యెదుగా తడవునుండి యేల నవ్వీనే ||
ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ మీ వలపు అదను బదనుగూడి అడుసాయె వలపు ||
ఎదురేది యెంచిచూడ నితని ప్రతాపానకు పదిదిక్కులను భంగపడిరి దానవులు
ఎను పోతుతో నెద్దు నేరుగట్టిన యత్లు యెనసి ముందర సాగదేటి బ్రదుకు ||
ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు యెనసి ముందర సాగదేటిబ్రదుకు ||
ఎన్నగలుగుభూతకోటినెల్ల జేసినట్టిచేత నిన్ను జేసుకొనుటగాక నీకు దొలగవచ్చునా ||
ఎన్నటి చుట్టమో యాకె నెరుగ నేను అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును ||
ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
ఎన్నడు దీరీ నీతెందేపలు (?) పన్నిన జీవులబంధములు.
ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు ||