ఎట్టయినా జేయుము యిక నీచిత్తము కిట్టిన నీ సంకీర్తనపరుడ ||
ఎట్టయినా జేసుకో ఇక నీ చిత్తము నన్ను పట్టిచ్చె మాగురుడు నీపాదాలు విడువను
ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా యెట్టివారికి నింక నేది తోవయ్య ||
ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టు లక్ష్మీనారాయణ యోగము ||
ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే బట్టరానిఘనబలవంతములు
ఎట్టు దరించీ నిదె యీజీవుడు బట్టబయలుగా బరచీ నొకటి ||
ఎట్టు దొరికెనె చెలియ యిద్దరికి నిటువంటి పట్టి నిలుపగరాని బరువైన వలపు ||
ఎట్టు నమ్మవచ్చునే ఇంతి మనసు నేడు వొట్టి యొక వేళ బుద్ధి యొకవేళా వచ్చునా ||
ఎట్టు నిద్దిరించెనో యీ రేతిరెల్లాను పట్టి చుట్టుక పయ్యద పడ దీసీ క్రిశ్ణుడూ ||
ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క గట్టిగా నిందుకే హరి కడుమెచ్చేమయ్యా // పల్లవి //
ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని నెట్టాన హరినే నమ్మనేర నయితిగా
ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక కట్టుకో పుణ్యమైనాగాక మరేమైనాను
ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్లు వెట్టివేమి సేయుమంటా వెన్నడించే ||
ఎట్టు సేసినా జేయి యెదురాడను నెట్టుకొని చూచేవి నీ మహిమలికను ||
ఎట్టుచేసిన జేసె నేమిసేయగవచ్చు చుట్టపువిరోధంబు సూనాస్త్రుచెలిమి ||