ఎక్కడి కంసుడు యిక నెక్కడి భూభారము చిక్కువాప జనియించె శ్రీకృష్ణుడు ||
ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి ||
ఎక్కడి పరాకుననో యిందాకా నుండెగాక మక్కువ నాపై బత్తి మానలేడె వాడు
ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము లొక్కట గెలిచితి మోహో నేము ||
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
ఎక్కడిదురవస్థ లేటిదేహము లోన జిక్కి జీవుడు మోక్షసిరి జెందలేడు ||
ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక ||
ఎక్కువకులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||
ఎచ్చోటి కేగిన యెప్పుడు దమలోని మచ్చిక పెనుదెవులు మానకపోయె ||
ఎచ్చోటికేగిన యెప్పుడూ దమలోని మచ్చిక పెనుదెవులు మానకపోయె ||
ఎటువంటి మచ్చికలో యెట్టి తరితీపులో చిటుకన నే వినేను చెవుల పండుగలు||
ఎటువంటి మోహమో ఏట్టి తమకమో గాని తటుకునను దేహమంతయు మరచె చెలియ
ఎటువంటి రౌద్రమో యెటువంటి కోపమో తటతట నిరువంక దాటీ వీడే ||
ఎటువంటి వలపో యెవ్వరి కొలది గాదు ఘటనతో దమకించి గనుగొనవయ్యా ||
ఎటువంటి విలాసిని యెంతజాణ యీ చెలువ తటుకన నీకు దక్క దైవార జూడవయ్యా ||