ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట యెవ్వరి గొలిచిన నిది నీకొలువు ||
ఎవ్వరికిగలదమ్మ యింత సౌభాగ్యము యివ్వల నీతో సరి యెంచరాదే నొరుల ||
ఎవ్వరికైనను యివ్రాత నను నవ్వులు సేసెబో నావ్రాత ||
ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానె గురుతు
ఎవ్వరివాడో ఈ దేహి యివ్వల నవ్వల నీ దేహి ||
ఎవ్వరివాడో యెఱుగరాదు అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే ||
ఎవ్వరు గర్తలుగారు యిందిరానాథుడే కర్త నివ్వటిల్లాతనివారై నేమము దప్పకురో ||
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది యివ్వల విచారించవే ఇందిరారమణా.
ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||
ఎవ్వరుగలరమ్మా యిక నాకు నెవ్వగలలో జిత్తము నెలకొన్నదిపుడు ||
ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||
ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి ఆకడ నాతడె హరినెఱిగినవాడు
ఏ నిన్నుదూరక నెవ్వరి దూరుదు నీ వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ||
ఏ పురాణముల నెంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||
ఏకతాన వున్నవాడు యిదివో వీడె చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు