ఎన్నడు మంచివాడ నయ్యేను నేను నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా
ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదె శ్రీవేంకాటనాథ ||
ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ।
ఎన్నాళ్ళదాక దానిట్టె వుండుట బుద్ధి కన్నపోవుట పూర్వకర్మశేషం
ఎన్నాళ్ళున్నా నిట్టె కదా విన్నని వెరగులె వేడుకలాయె ||
ఎన్ని చందములనెట్లైన నుతింతు కన్నుల నిన్నే కనుగొంటి గాన ||
ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు కనుల పండువులెల్ల గదిసినట్లుండె ||
ప|| ఎన్నిబాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా| మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా ||
ఎన్నిలేవు నాకిటువంటివి కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి ||
ఎపుడు గానిరాడో యెంత దడవాయ కాని చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా ||
ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును ||
ఎఱుక గలుగునా డెఱుగడటా మఱచినమేనితొ మరి యెఱిగీనా ||
ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి నెఱి దొరలనాడీని నేనే మందు నికను ||
ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు హరి దానే నిజపరమాతుమని ||
ఎవ్వడోకాని యెరుగరాదు కడు దవ్వులనే వుండు తలపులో నుండు ||