ఎంత మానుమన్న జింతలేల మానునే పంతపుమనసు హరిపై నుంటేగాక ||
ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము కాంతుడవేమి సేసితో కానుకలంపె చెలి ||
ఎంత లేదు చిత్తమా యీతలేల మోతలేల వంతులకు బారనేల వగరించనేలా ||
ఎంత వనికోకాని యెఋగనేను చెంతనే తెలుసుకో నేజెప్పితి నీ సుద్దులు ||
ఎంతగాలమొకదా యీదేహధారణము చింతాపరంపరల జిక్కువడవలసె ||
ఎంతచుట్టమో నీకునిదివో ఆపె సంతసపు వలపుల జడిసీ నాపె ||
ఎంతచేసిన తనకేది తుద చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ||
ఎంతటి వాడవు నిన్నేమని నుతింతును వింతలు నీకమర కుండగ విచారించే ||
ఎంతటివారలు నెవ్వరును హరి జింతించక నిశ్చింతలు గారు ||
ఎంతనేర్చెనే ఈ కలికి ఇంతుల కేటకే ఇంతేసి పగటు ||
ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ వింతవారితోడిపొందు వేసటాయ దైవమా ||
ఎంతమోహమో నీకీ ఇంతి మీదను వింత వింత వేడుకల మీదను ||
ఎంతవిచారించుకొన్నా నిదియే తత్త్వము హరి వంతుకు నీకృపగలవాడే యెరుగు హరి ||
ఎంతవిభవము గలిగె నంతయును ఆపదని చింతించినదిగదా చెడని జీవనము ||
ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు నంతవానిని భిక్షమడుగుకొన జేసె ||