ఎంతసేసినా నెడయకే పోయ ముంతలోనినీట మునిగిలేచుట ||
ఎంతైన దొలగవై తేదైన నామతికి వింతచవినేతుగా విషయబుద్ధి ||
ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను కందర్ప జనక నీవే గతిగాక మాకు
ఎందరు సతులో యెందరు సుతులో యిందు నందు నెట్లెరిగే నేను ||
ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు అందుర్లో నే నెవ్వడ నీ వాదరించే దెట్టో
ఎందాక నేచిత్త మేతలపో ముందుముందు వేసారితి ములిగి వేసరితి ||
ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే కందులేనిసుఖము కలనైన లేదు ||
ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు ||
ఎందు బొడమితిమో యెఱుగము మా కందువ శ్రీహరికరుణేకాక ||
ఎక్కగా రాగా రాగా యిందాకా దగులు యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు
ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల ||
ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు గడపల గానము వుక్కున బరితాపాల మూదల మండెడి ||
ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో తొక్కులవడె జీవుడు దుండగీలచేతను.
ఎక్కడనున్నా నీతడు దిక్కులు మాదెస దిరిగీగాక ||
ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి బత్తి చిక్కంచే దెటువలెనే చేతిలోనికతని ||