ఏవం శ్రుతిమత మిదమేవ త ద్భావయితు మతఃపరం నాస్తి ||
ఏవి నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని దావతి బడక యిది దక్కితే సులభము
ప|| ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని | దావతి బడక యిది దక్కితే సులభము ||
ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ మానుపరా దివి హరిమాయా మహిమలు
ఒకటి బోలిచిన వేరొకటి తోచీని సకలము బోలిచేము సుదతి సింగారాలు ||
ఒకటికొకటిగూడ దోయమ్మ నీయందే సకలము నెటువలె సంతసేసితివే ||
ఒకపరి కొకపరి కొయ్యారమై మొకమున కళలెల్ల మొలచినట్లుండె॥
ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ఒప్పులై నొప్పులై వుండుగాన అప్పటికి జూడ నదియేకా నిజము ||
ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు పొరల మేను ధరించి పొరలగ బట్టెను ||
ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక కొల్లలైనమేలు తనగుణములో నున్నది
ఒసగితివిన్నియు ఒకమాటే వెసనిక జేసే విన్నపమేది ||
ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా ||
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే నాయముగాదిందరిలో నగుబాటు తనకును