కలశా పురముకాడ కందువ చేసుకోని అలరుచున్నవాడు హనుమంతరాయడు
ప|| కలిగినది యొక్కటే కమలాపతిసేవ | తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను ||
ప|| కలిగినమతి వృధాగాకుండా | అలరుటె పుణ్యంబగు ఫలము ||
ప|| కలిగెనిది మాకు కైవల్యం | కలకలాము హరికథా శ్రవణం ||
కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది
ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
కలియుగంబునకు గలదిదియే వెలసిన పంచమ వేదమె కలిగె ||
ప|| కల్లగాదు నీవు మాకు గలిగితే జాలు | తొల్లిటి నీవు యింకా దోడుక వచ్చేను ||
కల్లమాడ దొడ్డముద్ర కటకటా చెల్లుబడికల్లలు చెప్పేరు లోకులు
కాంతల మానమనేటి కరవటాలకు దిగె మంతనాన జీవుడనే మంచిమరకాడు ||
ప|| కాకమరి యింతేల కలుగు దమకేతమకు | చేకొన్న కోరికలు చేరునందాకా ||
కాకుంటే యీశూన్యవాదకంఠినచిత్తులచేత పైకొని వివేకులకు బ్రదుకగవచ్చునా.
ప|| కాకున్న సంసారగతులేల | లోకకంటకములగు లోభములేల ||
ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||
ప|| కానవచ్చె నిందులోన కారుణ్య నరసింహా | తానకమై నీకంటే దాస్యమే పో ఘనము ||