ప|| కటకటా జీవుడా కాలముదోలుకరాగ | సటవటలనే పొద్దు జరపేవుగా ||
ప|| కటకటా దేహంబు గాసిబెట్టగవలసె | నిటువంటిదెసలచే నిట్లుండవలసె ||
కటకటా యిటుచేసె గర్మబాధ యెటువంటివారికిని నెడయదీబాధ ||
కటకటా యేమిటాను కడవర గానడిదే నిటలపువ్రాత యెట్టో నిజము దెలియదు.
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమలకొండ ||
ప|| కడగనుటే సౌఖ్యముగాక యీ- | తడతాకుల నెందరు చనరిట్లా ||
ప|| కడలుడిసి నీరాడగా దలచువారలకు | కడలేని మనసునకు గడమ యెక్కడిది ||
ప|| కడు జంచలములు కడు నధృవములు | కడునల్పములని కాదందురు ||
కడునజ్ఞానపుకరపుకాల మిదె వెడలదొబ్బి మావెరపు దీర్చవె
ప|| కడు అడుసు చొరనేల కాళ్ళు గడుగనేల | కడలేని జన్మసాగర మీదనేల ||
ప|| కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై | పడని పాట్లనెల్ల పడి పొరల నేలా ||
ప|| కదిసి యాతడు మమ్ముగాచుగాక | అదె యాతనికె శరణంటే నంటినేను ||
ప|| కనకగిరిరాయ యేగతి నొడబరచేవో | వినవయ్య సతినీకు విన్నవించుమనెను ||
ప|| కనినవాడా గాను కాననివాడా గాను | పొనిగి వొరులకై తే బోధించే నేను ||
ప|| కనియు గాననిమనసు కడమగాక | యెనలేని హరిమహిమకిది గురుతుగాదా ||