ప|| కనుగొనగ జీవు డెరుగడుగాక యెరిగినను | అనవరతవిభవంబు లప్పుడే రావా ||
కన్నవారెవ్వరు నేడు కాంతజవ్వనమిది పన్నిన విభుడ నీభాగ్గ్యమాయగాక ||
ప|| కన్నవిన్న వారెల్ల కాకు సేయరా | ఉన్నతుడ వైన నీకీ వొచ్చములేల నయ్య ||
కన్నులపండుగలాయ గడపరాయనితేరు మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు
ప|| కన్నులెదిటిదే ఘన వైకుంఠము | వెన్నుని గొలిచిన విజ్ఞానికిని ||
ప|| కపటాలు వద్దు గాక కాంతలతోను | యిపుడు చెల్లదా నీకు యెంత సేసినాను ||
ప|| కామించి నీవరుగగలయు నాయకుడ నే- | డేమి భాగ్యము సేసెనే తరుణి ||
ప|| కరుణానిధిం గదాధరం | శరణాగతవత్సలం భజే |
కరుణించు మికనైన కాపురమా కరికరి బెట్టకుమీ కాపురమా
కలకాలమిట్లాయ గాపురమెల్లా అలదైవమెందున్నాడో ఆలకించడుగా.
కలడా ఇంతటిదాత కమలనాభుడే కాక కలడన్న వారిపాలగలిగిన దైవము
ప|| కాకున్న సంసారగతులేల | లోకకంటకములగు లోభములేల ||
ప|| కలదింతె మాట కంతుని యాట | తెలుసుకో నీలోనిదియె పూట పూట ||
కలదిదివో సుఖము గలిగినను గర్బము నిలువక మానునా మలసి కామ్యకర్మములకుజొచ్చినమగుడ బుట్టువులు మానునా
ప|| కలలోని సుఖమే కలియుగమా- వెన్న | కలిలో నెక్కడిదె కలియుగమా ||