అంగడి నెవ్వరు నంటకురో యీ దొంగలగూడిన ద్రోహులను// పల్లవి //
అంగన నిన్నడిగి రమ్మనె నీమాట సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా
అంగన యెట్టుండినా నమరుగాక సంగతే నీకు నాపె సాటికి బెనగను
అంగనలీరే హారతులు అంగజగురునకు నారతులు ||
అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము శ్రింగారరాయఁడ నీకు శ్రీసతినిధానము // పల్లవి //
అంగనలాల మనచే నాడించుకొనెగాని సంగతెఱిగిననెరజాణ డితడే
అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక పంచమహాపాతకులభ్రమ వాపవశమా
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ రంజకపు చేతలు సురలకెంత వశమా
అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె వెంటబారనీదు నన్ను వెడమాయతురుము
అంతటనే వచ్చికాచు నాపద్భంధుడు హరి వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||పల్లవి||
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె వింతవింత విధముల వీడునా బంధములు
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదె జొచ్చితిని
అందరి బ్రదుకులు నాతనివే కందువెల్ల శ్రీకాంతునిదే
అందరి వసమా హరినెరుఁగ కందువగ నొకఁడుగాని యెరఁగఁడు // పల్లవి //