అది నాయపరాధ మిది నాయపరాధ మదియు నిదియు నాయపరాధము // పల్లవి //
అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు దుటు జీవులము వున్నారమిదివో // పల్లవి //
అదిగాక నిజమతంబది గాక యాజకం బదిగాక హృదయసుఖ మదిగాక పరము // పల్లవి //
అదిగాక సౌభాగ్యమదిగాక వలపు అదిగాక సుఖ్హమింక నందరికి గలదా ||
అదినీకు దారుకాణము అవునో కాదోకాని కదిసి చెప్పగబోతే కతలయ్యీగాని // పల్లవి //
అదినే నెఱగనా అంతలో భ్రమతు(గాక మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే // పల్లవి //
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము॥
అదివో కనుగొను మది యొకతె యెదుటనె నెలకొనె నిది యొకతె
అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని
అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు యెదురులేనివారు యేకాంగవీరులు ॥పల్లవి॥
అదె చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం // పల్లవి //
అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు // పల్లవి //
అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని వెదకి వెదకి తిరువీధులందు దేవుడు // పల్లవి //
అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో // పల్లవి //
అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును కదిసి యున్నారు తమకమున పెండ్లికిని