అచ్చుతుశరణమే అన్నిటికిని గురి హెచ్చుకుందు మరి యెంచఁగనేది // పల్లవి //
అటు గుడువు మనస నీ వన్నిలాగుల బొరలి ఇటు గలిగె నీకు నైహికవిచారములు // పల్లవి //
అటుగన రోయగ దగవా నటనల శ్రీహరి నటమింతే // పల్లవి //
అటుచూడు సతినేర్పు లవుభళేశ అటుమటములు గావు అవుభళేశ // పల్లవి //
అటువంటి వైభవము లమర జేసిన దైవ మిటువంటి యోగంబు లిన్నియును జేసి // పల్లవి //
అటువంటివాడువో హరిదాసుడు ఆటమాటలు విడిచినాతడే సుఖి // పల్లవి //
అట్టివేళ గలగనీ దదివో వివేకము ముట్టువడితే శాంతము మరి యేలా // పల్లవి //
అడుగరే చెలులాల అతనినే యీ మాట వుడివోని తమకాన నుండ బోలు తాను
అడుగరే యాతనినే అంగనలాలా గుడిగొని తానే వట్టి గొరబాయగాక
అడుగరే యీమాట అతని మీరందరును యెడయనిచోటను ఇగిరించుఁ బ్రియము // పల్లవి //
అడుగవయ్యా వరములాపె నేమైనా నీవు బడిబడి నిదివో ప్రత్యక్షమాయ నీకు
అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
అణురేణుపరిపూర్ణుడైన శ్రీవల్లభుని బ్రణుతించువారువో బ్రాహ్మలు // పల్లవి //
అతఁడే రక్షకుఁ డందరి కతఁడే పతి యుండఁగ భయపడఁ జోటేది // పల్లవి //
అతడు భక్తసులభు డచ్యుతుడు రాతిగుండెవాడు గాడు రంతు మాను డికను