అయ్యో వారిభాగ్య మంతేకాక నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు // పల్లవి //
అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు యియ్యెడ నెట్టుగలిగె నీయసురమతము. // పల్లవి //
అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము ముయ్యంచుమనసున నే మోహమతి నైతి // పల్లవి //
అరయశ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో నుదయించె శ్రీకృష్ణుడిదివో // పల్లవి //
అరసినన్ను గాచినాతనికి శరణు పరము నిహము నేలే పతికిని శరణు
అరిదిసేతలే చేసి తల్లాడ నిల్లాడ సరిలేక వుండితివి జలరాశికాడ // పల్లవి //
అరుదరుదీగతి అహోబలేశ్వర పొరి(బొరి దాసుల పొగడుట యెట్టు
అరుదరుదు నీమాయ హరిహరీ అరసి తెలియరాదు హరిహరీ // పల్లవి //
అఱిముఱి హనుమంతుడు అట్టి బంటు వెఱపులేని రఘువీరునికి బంటు
అలపు దీర్చుకోరాద అన్నీనయ్యీ గని నిలువెల్లా జెమరించి నీళ్ళు గారీని // పల్లవి //
అలమేలు మంగవు నీ వన్నిటా నేరుపరివి చలము లేటికి నిక సమ్మతించవే // పల్లవి //
అలమేలుమంగనీ అభినవరూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ // పల్లవి //
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ వుయ్యాల||
అలర నుతించరో హరిని యెలయించి మిము భ్రమయించీనీ గాలము // పల్లవి //
అలరులు గురియగ నాడెనదే అలకల గులుకుల నలమేలుమంగ // పల్లవి //