అన్నియును దన ఆచార్యాధీనము చెన్నుమీఱ హరిపాదసేవసేయు మనసా // పల్లవి //
అన్నియును నతనికృత్యములే ఎన్నియైనా నవు నతడేమి సేసినను // పల్లవి //
అన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి // పల్లవి //
అన్నివిభవముల అతడితడు కన్నులువేవేలు గలఘనుడు // పల్లవి //
అపరాధిని నే నై నాను కృపగలవారికిఁ గపటము లేదు // పల్లవి //
అపుడేమనె నేమనుమనెను తపమే విరహపు తాపమనె
అపురూపమైన మొహముదాచి యిటువంటి కపటపు నటనలు గడించనేలే ||
అప్పటికప్పుడే కాక అంత యేటికి యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము // పల్లవి //
అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు యిప్పు డిట్టిమహినుల నెక్కుడాయ నీతడు // పల్లవి //
అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకు మిక చిప్పిల మోహించిన నీ చేతిలోని దానను // పల్లవి //
అప్పుడువో నిను గొలువగ నరుహము గలుగుట ప్రాణికి కప్పినదియు గప్పనిదియు గనుగొన గలనాడు
అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి చెప్పుడుమాటలకే నే జేరనైతిగా
అప్పులవారే అందరును కప్పగ దిప్పగ గర్తలు వేరీ // పల్లవి //
అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి //
అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి