అలవటపత్రశాయివైన రూప మిట్టిదని కొలువై పొడచూపేవా గోవిందరాజా // పల్లవి //
అలుక లేటికి రావే యాతనివద్దకి నీవు బలిమైతే వలపులు పదనుకు వచ్చునా // పల్లవి //
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలి నిందిర నీతో నవ్వినది // పల్లవి //
అలుగకువమ్మ నీ వాతనితో నెన్నఁడును పలువేడుకలతోనె పాయకుండరమ్మా // పల్లవి //
అల్లదె జవ్వని హరి యురమున నదె మెల్లనె యిటు వుపమించరే మీరు ||
అవతారమందె నిదె అద్దమరేతిరికాడ భవహరుఁడు శ్రావణబహుళాష్టమిని // పల్లవి //
అవధరించఁగదవయ్య అన్నిరసములు నీవు తివురుచునబ్బెనిదె తేనెమోవిరసము // పల్లవి //
అవధారు దేవ హరికుల రామ వివిధమై నీబంటు వెలయుచున్నాడు
అవధారు రఘుపతి అందరిని చిత్తగించు ఇవలనుండే కొలువిదెనదె సముఖాన // పల్లవి //
అవి యటు భావించినట్లాను కవగొని యిందుకు గలగరు ఘనులు // పల్లవి //
అవియే పో నేడు మాతోనంటి సేసే తపములు వివరించుకొని ఇట్టె విచ్చేయి మనవే ||
అవునయ్య నీ సుద్దు లటు వంటివి జవళితో నంటు బచ్చలి వంటి వాడవు // పల్లవి //
అస్మదాదీనాం అన్యేషాం తస్మిన్ తస్మిన్ తత్ర చ పునశ్చ // పల్లవి //
అహో నమో నమో ఆదిపురుష నీకు ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి // పల్లవి //
అహోబలేశ్వరుడు అఖిల వందితుడు మహి నితని గొలిచి మనుడిక జనులు // పల్లవి //