అభయదాయకుడ వదె నీవేగతి ఇభరక్షక నన్నిపుడు కావవే // పల్లవి //
అభయము అభయమో హరి నీవు విభుడ వింతటికి వెర వికనేది // పల్లవి //
అమరాంగనలదె ఆడేరు ప్రమదంబుననదె పాడేరు
అమరాంగనలదె నాడేరు ప్రమదంబున నదె పాడేరు // పల్లవి //
అమరెగదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సతి నీమేన // పల్లవి //
అమీదినిజసుఖ మరయలేము పామరపుచాయలకే భ్రమసితిమయ్యా // పల్లవి //
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ // పల్లవి //
అమ్మెడి దొకటి అసిమలోదొకటి బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా // పల్లవి //
అయనాయ వెంగెమేలే అతివా ! నీ- ఆయమే తాఁకీ మాఁట లందుకేమి సేతురా // పల్లవి //
అయమేవ అయమేవ ఆదిపురుషో జయకరం తమహం శరణం భజామి // పల్లవి //
అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు ముయ్యంచుచంచలాన మోసపోతిగాక // పల్లవి //
అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని // పల్లవి //
అయ్యో మానుపగదవయ్య మనుజుడు తన కయ్యపుగంట గానడు // పల్లవి //
అయ్యో మాయల బొంది అందు నిండు నున్నవారు యియ్యగొన గర్తలుగా రెఱగరు జడులు // పల్లవి //
అయ్యో యేమరి నే నఁ ప్పుడేమై వుంటినో అయ్యడ నీ దాసి నైతే ఆదరింతుగా // పల్లవి //