ఈతగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపుజీవులకు గలదా వివేకము
ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల భూతములలోన దా బొదలువాడితడు ||
ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు డితడు గలుగబట్టి యిందరు బదికిరి ||
ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు
ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు చేతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు
ఈతని మహిమలు ఎంతని చెప్పెద చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||
అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు // పల్లవి //
అన్నిట నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను యెన్నగ నీవొక్కడవేగతియని యెంచికొలుచుటే ప్రపన్న సంగతి // పల్లవి //
ఇన్ని జన్మములేటికి హరిదాసు లున్న వూర దానుండిన జాలు ||
ఈదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఇ ఇదిగాక వైభవం బిక నొకతిగలదా? ||
ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము మోదమెరంగని మోహము ముందర గననీదు ||
ఈపెకు నితడు దగు నితనికీపె దగు చూపులకు పండుగాయ శోభనము నేడు ||
ఈభవమునకు జూడ నేది గడపల తనదు ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||
ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు ||
ఈసుర లీమును లీచరాచరములు యిసకలమంతయు నిది యెవ్వరు ||